prabhas, Shah Rukh Khan: ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్.. ప్రభాస్‌ను బీట్ చేసిన షారుఖ్ ఖాన్! – shah rukh khan become a highest paid hero in india crosses prabhas

పాండమిక్ తర్వాత బాలీవుడ్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. రీసెంట్‌గా షారుఖ్ నటించిన ‘పఠాన్’ మూవీ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ట్రెమండస్ కలెక్సన్స్ రాబట్టగలిగింది. మరోవైపు ‘బాహుబలి2’ (Bahubali2) వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత హీరో ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాలీవుడ్‌లోనూ ఆయనకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో ప్రభాస్ మార్కెట్ పరిధి విస్తృతం కాగా.. రెమ్యునరేషన్‌ కూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోయింది. అలాగే కొంత కాలంగా రెమ్యునరేషన్ పరంగా ప్రభాస్ టాప్‌లో ఉండగా.. తాజాగా అతని రికార్డ్‌ను షారుఖ్ (Shah Rukh Khan) బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి బాలీవుడ్‌లో ఈ మధ్య సౌత్ సినిమాల హవా పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకునే హీరో (Highest Paid Indian Star) ఎవరనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అయితే ‘బాహుబలి 2’ తర్వాత తన సినిమాలన్నింటికీ ప్రభాస్ రూ. 120-150 కోట్ల మధ్య వసూలు చేస్తున్నాడని గతంలో రూమర్స్ వినిపించాయి. అదే టైమ్‌లో అక్షయ్ కుమార్, కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దళపతి వంటి బడా స్టార్లు రూ. 70-100 కోట్ల మధ్య రెమ్యునరేషన్‌కు డిమాండ్ చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. కానీ తాజా రిపోర్ట్స్ ప్రకారం.. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ దాదాపు తన చివరి చిత్రానికి గాను రూ. 200 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
Chiranjeevi: ‘బలగం’ మొగిలయ్యకు అండగా మెగాస్టార్.. కంటి చికిత్సకు ఆర్థిక సాయం!
షారుఖ్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే షారుఖ్.. ‘పఠాన్’ డొమెస్టిక్ రెవెన్యూలో 60% షేర్ తీసుకున్నట్లు తెలిసింది. ఇది దాదాపు రూ. 200 కోట్లకు సమానం. దీంతో ప్రస్తుతం ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే సూపర్ స్టార్‌గా నిలిచాడు షారుఖ్. అయితే ఈ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి. సినిమాల విజయం, వారి మార్కెట్‌ను బట్టి రెమ్యునరేషన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఏ హీరో కూడా తమ నిజమైన చెల్లింపుల లెక్కలను ఎవరికీ వెల్లడించరనే విషయం గుర్తుంచుకోవాలి.

ఇక RRR ఆస్కార్ విజయం తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్‌డమ్ కూడా పెరిగింది. వీళ్లిద్దరూ ఇప్పుడు గ్లోబల్ స్టార్స్‌గా పిలవబడుతున్నారు. త్వరలోనే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ఉంది. చెర్రీ, తారక్ రెమ్యునరేషన్ కూడా రూ. 100 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, హీరోలు ప్రస్తుతం పర్టిక్యులర్ రెమ్యునరేషన్‌కు ఫిక్స్ అవకుండా సినిమా ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

  • Learn latestTollywood updatesandTelugu Information

[ad_2]

Leave a Comment