trivikram srinivas, Pawan Kalyan: మరో మేనల్లుడితో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. మళ్లీ త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే! – pawan kalyan signs for another new film under supervision of trivikram

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తక్కువ టైమ్‌లో వీలైనన్ని ఎక్కువ సినిమాలు ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఎలక్షన్స్ సమీపిస్తున్నందున మరికొద్ది నెలల్లో ఆయన పాలిటిక్స్‌లో బిజీ అయిపోతారని తెలిసిందే. అయితే క్రిష్ దర్శకత్వంలో ఎప్పుడో మొదలుపెట్టిన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఇదిలా ఉండగానే మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి PKSDT పూర్తి చేసిన పవన్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. మరోవైపు ముంబైలో OG షూటింగ్ కూడా మొదలైంది. ఇలా ఇన్ని సినిమాలు సెట్స్‌పై ఉండగానే ఆయన తాజాగా మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ‘రావణాసుర’తో బాక్సాఫీస్ వద్ద్ ఫ్లాప్ ఎదుర్కొన్న సుధీర్ వర్మ (Sudheer Varma) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రాలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఫైనలైజ్ చేస్తున్నాడని తెలిసిందే. గతేడాది సాగర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ రీమేక్‌‌కు‌ స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించారు. అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న PKSDT చిత్రానికి కూడా అవే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే, పవన్ తాజాగా సైన్ చేసిన ప్రాజెక్ట్‌కు సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని టాక్. అంటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాతే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు ఈ చిత్రంలో మరొక యంగ్ హీరో పాత్రలో పవన్ కళ్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇక ఈ చిత్రానికి కూడా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ బాధ్యతలు త్రివిక్రమ్‌వే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. కాస్ట్ అండ్ క్రూ ఇంకా ఫైనలైజ్ కాలేదు. కాగా.. మేకర్స్ ఈ మూవీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న OG మూవీ షూటింగ్ అప్‌డేట్‌ను ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు స్టైలిష్ వీడియో రిలీజ్ చేసి అభిమానుల్లో జోష్ నింపింది. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సదరు వీడియోలో తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోగా.. డీవీవీ దానయ్య నిర్మాత.

  • Learn latestTollywood updatesandTelugu Information

Leave a Comment