ఖాసీ భాషలో ‘కా’ అనేది స్త్రీ లింగాన్ని సూచిస్తుంది. లికై అనేది ఒక స్త్రీ పేరు. అయితే స్థానిక పురాణాల ప్రకారం నోహ్కాలికై జలపాతానికి పైన ఓ గ్రామం వుంది. అదే రంగ్జిర్తెహ్ గ్రామం. అక్కడ లికై అనే మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె తన బిడ్డతో పాటు ఉండేది. తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు కష్టంగా ఉండేది. దాంతో ఆమె మరో వివాహం చేసుకుంది. ఆమె రెండో భర్త దుర్మార్గుడు. అతనికి మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఓ రోజు భార్యకి వంట చేసి పెట్టాడు. ఆ సమయంలో బిడ్డ కనిపించ లేదు.
ఆ బిడ్డని చంపేసి భార్యకు వండి పెట్టాడు ఆ రాక్షసుడు. మాంసం కూర తినేసి తమలపాకులు, వక్క వేసుకునేటప్పుడు ఆమెకి ఇదంతా తెలిసిందట. లికై.. తమలపాకులు వేసుకునే చోటికి వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు వుంది. ఇది చూసి.. ఆశ్చర్యపోయిన ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఆ తర్వాత ఆమె.. ఓ చేతిలో గొడ్డలితో.. ఊర్లో పరుగులు పెడుతూ.. చివరకు జలపాతంలో పడిపోయినట్లు చెబుతారు. దాంతో ఆమె పేరు మీదనే నోహ్కాలికై అనే పేరు వచ్చింది.
ఆ జలపాత వీడియోని ఇక్కడ చూడండి (viral video)
ఇదంతా నిజంగా జరిగింది అనేందుకు ఆధారాలు లేవు. స్థానికులు మాత్రం ఇదే కథను చిన్న చిన్న మార్పులతో ఇలాగే చెబుతుంటారు. చాలా మంది ఈ కథను తెలుసుకొని.. స్థానికులు చెప్పే విషయాలు రికార్డ్ చేసుకుంటారు. కానీ ఎవరూ దీన్ని నిరూపించేందుకు వీలుగా ఆధారాలు లేవు.
Learn LatestViral NewsandTelugu Information
[ad_2]